పొన్నూరు (గుంటూరు) : పొన్నూరు మున్సిపాలిటీకి 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన పార్టీలైన వైయస్సార్సీపి తెలుగుదేశం పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలకు ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు.
పుర పోరుకు పొన్నూరు సిద్ధమవుతోంది. ఈనెల 26వ తేదీన ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నియోజకవర్గంలో ప్రభంజనం సృష్టించింది. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అదే ఒరవడితో ముందుకు సాగాలని కూటమి న్యాయకత్వం భావిస్తోంది.స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే పట్టణంలోని మూడు వార్డులు ఏకగ్రీవం కావడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తంగా అన్ని స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఇప్పటికే పిలుపునిచ్చారు. వైయస్సార్సీపి కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో అంబటి మురళీకృష్ణ నాయకత్వంలో పార్టీ నాయకత్వాన్ని సమన్వయపరిచి పోటీ చేస్తుంది.

అత్యధిక స్థానాల్లో గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈనెల 26న జరగబోయే పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ అభ్యర్థులుగా 5గురు మహిళలు పోటీ పడుతుండగా, 40 వార్డులకు గాను 3 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 37 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.చైర్ పర్సన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ తరపున కాండ్రు విజయలక్ష్మి, వైసీపీ తరపున షేక్ నాజిని, కాంగ్రెస్ పార్టీ నుంచి కూరాకుల దివ్యజ్యోతి, బీఎస్పీ అభ్యర్థిగా పొందుగల అరుణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యరసాని సరిత బరిలో నిలిచారు. పట్టణంలోని మొత్తం 40 వార్డులలో 18వ వార్డు (మలునేని రజిని), 23వ వార్డు (వేజెండ్ల హనుమంతరావు), 35వ వార్డు (షేక్ ఫాతిమా సానీ)లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 37 వార్డులకు గాను మొత్తం 81 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్టీల వారీగా చూస్తే వైసీపీ 37, టిడిపి 29 (ఏకగ్రీవమైన మూడు స్థానాలతో కలిపి), జనసేన 8, బీజేపీ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 5 వార్డుల్లో పోటీలో ఉన్నారు.

వార్డుల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 1వ వార్డులో నామా దేవదాస్ (జనసేన), నామా ప్రదీప్ (వైసిపి), వీర్నపు సత్యనారాయణ (టిడిపి); 2వ వార్డులో గోపిశెట్టి శ్రీనివాసరావు (వైసిపి), తోట ప్రసాద్ (టిడిపి); 3వ వార్డులో వేంపాటి సుధీర్ (జనసేన), షేక్ మౌలాలి (వైసిపి), పెర్ల సునీల్ కుమార్ (ఇండిపెండెంట్); 4వ వార్డులో ఆదెళ్ళ వాసంతి (జనసేన), వీర్నాల పద్మావతి (వైసిపి); 5వ వార్డులో తానికొండ సాయి కుమార్ (టిడిపి), దండ వెంకట వంశీ కృష్ణ (వైసిపి), బండి నాగరాజు (ఇండిపెండెంట్); 6వ వార్డులో పబ్బిశెట్టి ఉమా కుమారి (టిడిపి), షేక్ అఫ్టలూన్ (వైసిపి); 7వ వార్డులో షేక్ గౌస్ పీర్ (కాంగ్రెస్), షేక్ జానీ బాషా (వైసిపి), షేక్ బాజీ సాహెబ్ (టిడిపి), అబ్దుల్ ఖాదర్ (ఇండిపెండెంట్) 8వ వార్డులో గాజుల వెంకట సత్యనారాయణ (వైసిపి), చెన్నుపాటి భాస్కర్ (టిడిపి); 9వ వార్డులో ఆకుల పద్మావతి (జనసేన), కాగిత సంగీత (వైసిపి), 10వ వార్డులో చల్లపల్లి జాన్ బీ (టిడిపి), ముద్రబోయిన భాగ్యలక్ష్మి (వైసిపి) , 11వ వార్డులో నిమ్మకాయల నాగమణి (టిడిపి), ముకిరి అనిల్ కుమార్ (వైసిపి), యడ్ల భాస్కరి (ఇండిపెండెంట్); 12వ వార్డులో నన్నపనేని సింధూష (టిడిపి), బలగాని నాగలక్ష్మి (వైసిపి) 13వ వార్డులో పలగాని సునీత (వైసీపీ), వెన్నం సువర్ణలత (టిడిపి) 14వ వార్డులో కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు (టిడిపి), వల్లూరి కిరణ్ బాబు (వైసిపి), 15వ వార్డులో కర్ర మహేష్ (టిడిపి), మండ్రు అనిత (వైసిపి); 16వ వార్డులో చింతగుంట వెంకటరావు (వైసీపీ), పాలచుళ్ల చక్రధర్ (జనసేన); 17వ వార్డులో ఎద్దు సోంబాబు (టిడిపి), డక్కుమళ్ల ఎస్తేర్ (వైసిపి) 19వ వార్డులో పెద్దర్ల శ్రీధర్ (టిడిపి), మరుపూడి రాంబాబు (వైసిపి); 20వ వార్డులో అడ్ల లక్ష్మణరావు (టిడిపి), నంబూరి ఎస్సమ్మ (వైసిపి) , 21వ వార్డులో తుమ్మల రమణమ్మ (టిడిపి), షేక్ షకీరున్నీసా (వైసిపి); 22వ వార్డులో కొత్తూరి లక్ష్మి నాగ దుర్గ (వైసిపి) దేశంశెట్టి కనకరత్నం (జనసేన, 24వ వార్డులో విన్నకోటి రామలక్ష్మి (వైసిపి), వెన్ను సుజాత (జనసేన); 25వ వార్డులో అబ్దుల్ మజీద్ (టిడిపి), షేక్ బాబు (వైసిపి); 26వ వార్డులో పఠాన్ రిహానా బేగం (టిడిపి), షేక్ సల్మా (వైసిపి); 27వ వార్డులో తోటకూర దీక్షిత (టిడిపి), మిక్కిలి హెప్సి (వైసిపి) 28వ వార్డులో ఇండ్ల వెంకట పార్వతి (వైసిపి), తట్ట నాగమణి (టిడిపి); 29వ వార్డులో గేరా కుమారి (వైసిపి), గోవతోటి ఆదిలక్ష్మి (టిడిపి); 30వ వార్డులో ఆకురాతి శ్రీనివాసరావు (టిడిపి), పంచుమర్తి పోతురాజు (వైసిపి), 31వ వార్డులో అలపర్తి చంద్రమోహన్ (టిడిపి), యాజలి వెంకట అనిల్ బాబు (వైసిపి); 32వ వార్డులో నంబూరి పద్మారావు (టిడిపి), పులి యేస్తేరమ్మ (వైసిపి) 33వ వార్డులో అవిల డక్కుమళ్ల (టిడిపి), డి శిరీష (వైసిపి); 34వ వార్డులో మహ్మద్ తంగిలా బేగం (వైసిపి), షేక్ కౌసర్ జాన్ (టిడిపి); 36వ వార్డులో షేక్ మహమ్మద్ గౌస్ (టిడిపి), షేక్ మహమ్మద్ (వైసిపి); 37వ వార్డులో షేక్ షమీమున్ (వైసిపి), సయ్యద్ కరిష్మా (టిడిపి); 38వ వార్డులో షేక్ కరీముల్లా (జనసేన), షేక్ సల్మాన్; 39వ వార్డులో అప్పికట్ల నాగ శ్రీనివాసరావు (వైసిపి), యరసాని శ్రీరామమూర్తి (టిడిపి), యరసాని శ్రీకాంత్ (ఇండిపెండెంట్), 40వ వార్డులో కలపాల విజయలక్ష్మి (బిజెపి), సున్నా సుజాత (వైసిపి) ఎన్నికల బరిలో నిలిచారు. ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.







కామెంట్లు (0)