మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలగుమ్మి ప్రజలు చంద్రమోహన్ వైపు మొగ్గు

13 నిమిషాల క్రితం

People of Palagummi lean towards Chandramohan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : పాలగుమ్మి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాట్రు చంద్రమోహన్ పోటి చేస్తున్న క్రమంలో గ్రామ ప్రజలందరూ తన వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.మంగళవారం ఆయన స్థానిక వైసీపీ నాయకులు వాసు ఆధ్వర్యంలో గ్రామంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు నాయకులు, మహిళలు, యువకులు ప్రచారంలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామ ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపిటిసి ఎన్నికలలో తమ అభ్యర్థి విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి చంద్రమోహన్ ను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కుడిపూడి బాబు,స్థానిక నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్