మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగ్గురు దొంగలు అరెస్ట్‌

16 నిమిషాల క్రితం

Three thieves arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 03:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • దొంగిలించబడిన బంగారు వస్తువులు స్వాధీనం.

  • నమోదైన నాలుగు రోజుల్లోనే కేసు చేదన.


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 90 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.11.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.


మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 147/2026, సెక్షన్ 303(2) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఆలమూరు మండలం మూలస్థానం గ్రామ సమీపంలోని 216(ఏ) జాతీయ రహదారి వద్ద అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో విశాఖపట్నం జిల్లా వడ్డాది మాడుగుల మండలం తుడుం వీధికి చెందిన రావుల దుర్గ (50), తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం డైవర్స్ కాలనీకి చెందిన బండి శివపార్వతి (34), వడ్డాది మాడుగుల గ్రామానికి చెందిన రావుల శ్రీను (50) ఉన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగుల్లోని నగదు, బంగారు ఆభరణాలను అపహరిస్తున్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు పై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. విద్యాసాగర్, అమలాపురం క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.కొండయ్య అనుమతితో ఆలమూరు ఎస్సై జి. నరేష్ తన సిబ్బందితో కలిసి ఈ కేసును దర్యాప్తు చేపట్టారు. ఈ అరెస్టుల్లో ఏఎస్ఐ డి. స్వామి, డబ్ల్యూఏఎస్ఐ ఈ.మణికుమారి, పోలీస్ కానిస్టేబుళ్లు పి.రాజు, వి.చిట్టిబాబు, జి.కృష్ణసాయి, ప్రసాద్ తదితరులు కీలక పాత్ర పోషించారు. కేసు నమోదైన నాలుగు రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన ఆలమూరు ఎస్సై జి.నరేష్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. మహిళల ప్రయాణ సమయంలో వారి విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్