నాగులుప్పలపాడు (ప్రకాశం) : ప్రకాశం జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి ఆ పై హతమార్చాడు. బాలికను అమ్మమ్మ వద్ద ఉంచి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బేల్దారి పనులకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను అదే కాలనీకి చెందిన అజ్జం ఆనంద్ అక్కడి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం హతమార్చి ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆరేళ్ల బాలికపై హత్యాచారం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)