ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. వర్షంతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం, మన్యం జిల్లాలతో పాటు పాత శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.. కలెక్టరేట్లలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే గమనించాలని సూచించారు.
ఏపీకి రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)