రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 12న సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఇరుముడి’ ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కాగా, తన జీవితంలో ఎదురైన సంఘటన ఆధారంగానే ‘ఇరుముడి’ చిత్ర కథను రాసుకున్నానని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. ఈ సినిమా టైటిల్‌కు, శబరిమలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి, కథలో సంఘర్షణను సృష్టించడానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా మాత్రమే అయ్యప్ప దీక్షను ఉపయోగించినట్లు చెప్పారు.







కామెంట్‌లు (0)