దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘డేర్ డెవిల్’. ఈ సినిమాలో అగ్రహీరోలు వెంకటేష్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అజిత్‌తో తనకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమాలో నటించేందుకు వెంకటేష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించిన వెంకటేష్ ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలిని అజిత్ కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
‘డేర్ డెవిల్’లో వెంకటేష్, మోహన్‌లాల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)