ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘తుంగభద్ర’కు తగ్గిన ఇన్‌ఫ్లో

7 గంటల క్రితం

irriga
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 14 రోజుల్లో 7.59 టిఎంసిలు తగ్గుదల

​ప్రజాశక్తి-అనంతపురం : ​తుంగభద్ర డ్యాంకు వరద ఆగిపోయింది. డ్యాంలో నిల్వలు క్రమంగా కరిగి పోతున్నాయి. ఆగస్టులో తుంగభద్ర డ్యామ్‌కు వచ్చిన ప్రవాహాలు కాస్త సెప్టెంబర్‌ వచ్చేసరికి పూర్తిగా పడిపోయాయి. ఇప్పుడు ఎగువ తుంగ భద్ర పరీవాహక ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కాస్త సున్నాకు పడిపోయింది. ఇదే సమయంలో డ్యాం నుంచి కింది కాలువలకు దాదాపు పది వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.

​రిజర్వాయర్ నిల్వలే ఆధారం !

​ఆగస్టు 29న తుంగభద్ర రిజర్వాయర్‌లో 96.419 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, సెప్టెంబర్ 12వ తేదీ నాటికి అది 88.828 టిఎంసిలకి తగ్గింది. అంటే కేవలం 14 రోజుల్లో సుమారు 7.59 టిఎంసిల నిల్వ తగ్గింది. నీటిమట్టం 1630.62 అడుగుల నుంచి 1628.58 అడుగులకు పడిపోయింది. అంటే రిజర్వాయర్ మట్టం ఏకంగా 2.04 అడుగులకు తగ్గింది. మరోవైపు సాగునీటి అవసరాల కోసం నీటి విడుదల డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 12న డ్యాం కుడి, ఎడమ కాల్వలకు మొత్తం 9,963 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇందులో ఎపి సరిహద్దు వద్ద హెచ్ఎల్‌‌సికి నీటి సరఫరా 1,703 క్యూసెక్కులుగా నమోదైంది. గతేడాది ఇదే సెప్టెంబర్ 12న తుంగభద్రకు 17,097 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా ఈసారి సున్నాగా నమోదైంది. గత పదేళ్లుగా ఇదే రోజు సగటు ఇన్ ఫ్లో 23,250 క్యూసెక్కులు. ప్రస్తుతం డ్యాంలో 88.828 టిఎంసిలు నీటి నిల్వ ఉండడం కొంతలో కొంత ఉపశమనం. గతేడాది ఇదే సమయంలో రిజర్వాయర్ నిల్వ 80.003 టిఎంసిలు మాత్రమే. అంటే గతేడాది కంటే ఈ ఏడాది నీటి నిల్వ ఎక్కువే. ప్రస్తుతం కొత్తగా ఇన్ ఫ్లో లేకుండా రోజూ దాదాపు పదివేల క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగితే మాత్రం నిల్వలు వేగంగా తగ్గుపోయి పరిస్థితి ప్రమాదకరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇన్ ఫ్లో ఎలా పడిపోయిందంటే...

​తుంగభద్ర డ్యామ్‌కు పైనుంచి వచ్చే ప్రవాహాలు రోజు రోజుకు పడిపోతూ వస్తున్నాయి. ఆగస్టు నెల నుంచి రోజు వారీ ఇన్ ఫ్లో వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్