బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఇసిపై ‘ప్రజా అభిశంసన’

1 గంట క్రితం

gyaneshkumar.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రేపు ఖర్గే నివాసంలో ఇండియా బ్లాక్‌ నేతల సమావేశం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్‌ కుమార్‌పై అక్టోబర్‌ 30న ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్ర‌తిప‌క్ష‌ ఇండియా బ్లాక్‌ నిర్ణయించింది. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష‌నేత‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. తొలుత అశోక్‌ హోటల్‌లో, అనంతరం రామ్‌లీలా మైదానంలో నిర్వహించాలనుకున్న కార్యక్రమానికి అనుమతుల విషయంలో సమస్యలు ఎదురవడంతో వేదికను మార్చినట్లు నేతలు తెలిపారు. ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఓటర్ల తొలగింపు, ఎన్నికల అక్రమాల ఆరోపణలపై జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్‌ డిమాండ్‌ చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్