బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి కథనానికి స్పందన.. వృథాగా పోతున్న తాగునీటికి అడ్డుకట్ట

1 గంట క్రితం

chitur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 05:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పైపుల లీకేజీని పరిశీలించి మరమ్మతులు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి సాయి తేజ

ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : మండలంలోని గంగినాయన పల్లి లోనిగ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పైపుల లీకేజీల కారణంగా విలువైన నీరు వృథాగా పోతున్న విషయాన్ని ప్రజాశక్తి వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించారు. ఇటీవల తాగునీటి పైపుల నుంచి నీరు వృథాగా ప్రవహిస్తూ రహదారి పక్కన నిల్వ ఉండటంపై ప్రచురితమైన కథనానికి స్పందించిన పంచాయతీ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి సాయి తేజ సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, లీకేజీ ఏర్పడిన పైపును గుర్తించారు. వెంటనే సిబ్బందితో మరమ్మతులు చేయించి తాగునీరు వృథాగా పోకుండా చర్యలు చేపట్టారు. దీంతో రోజుల తరబడి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట పడింది. తాగునీరు ప్రజలకు అత్యంత అవసరమైన వనరని, చిన్నపాటి పైపుల లీకేజీలను సైతం నిర్లక్ష్యం చేస్తే పెద్ద మొత్తంలో నీరు వృథా అయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఇకపై గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి పైపుల లీకేజీలు, నీటి వృథా కనిపిస్తే వెంటనే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్