బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వంట వార్పుతో విఆర్ఏల నిరసన

1 గంట క్రితం

aalamuru-4
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండల కేంద్రమైన ఆలమూరు తాహసిల్దార్ కార్యాలయం ఎదుట గల ధర్నా చౌక్ లో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం చేస్తున్న నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమంలో వంట వార్పుతో 22వ రోజైన బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మండల విఆర్ఏల సంఘం అధ్యక్షులు తాతపూడి ఇస్సాక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్ ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని, మరణించిన విఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విఆర్ఎల సంఘం సెక్రటరీ కె.శివరామారావు, ఉపాధ్యక్షుడు భువనగిరి ఏసు, సలహాదారుడు నాగేశ్వరరావు, ట్రెజరర్ కుందేటి శ్రీను, సభ్యులు యార్లగడ్డ జీవరత్నం, ఏడిది వెంకటాద్రి, బూరిగ మంగాలక్ష్మీ, చోడవరపు రామలక్ష్మి, కోట లక్ష్మీ, షేక్ బషీర్ బిబి, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్