బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో కొత్త విమానాశ్రయాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

1 గంట క్రితం

Rammohan Naidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 05:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ : ఏపీలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, కుప్పం, నాగార్జున సాగర్ సమీపంలో, అమరావతి వంటి ప్రాంతాల్లో ఈ నూతన విమానాశ్రయాలు రానున్నాయని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక మినీ ఎకనామిక్ సిటీగా రూపాంతరం చెందనుందన్నారు. ఉత్తరాంధ్రలో భారీ పారిశ్రామిక అభివృద్ధి జరగనుందని, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'విశాఖ ఎకనామిక్ రీజియన్' కూడా త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్