శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరిటైర్డ్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

3 గంటల క్రితం

Retired IPS officer Balasubrahmanyam passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రిటైర్డు ఐపిఎస్ అధికారి, ఎపిఎస్ఆర్‌‌టిసి మాజీ ఛైర్మన్ ఎన్‌ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలోని న్యూయార్క్‌‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజిగా, ఇ-ప్రగతి అథారిటీ సిఇఒగా, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌‌టిజిఎస్) సిఇఒగా సేవలందించారు. ఈ ఏడాది ఆగస్టు 30న ఆయన ఎపిఎస్‌ఆర్‌‌టిసి వైస్‌ ‌ఛైర్మన్‌, ఎమ్‌‌డిగా తన సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని మరో మూడు రోజుల్లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది.

రిటైర్డు ఐపిఎస్‌ అధికారి ‌బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. నిజాయతీ విషయంలో రాజీపడకుండా ధృడమైన నిర్ణయాలు తీసుకున్నారని ట్వీట్‌ ‌చేశారు. పోలీస్‌శాఖలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధతతో విధులు నిర్వహించారని వెల్లడించారు. ఆయన మరణం పోలీస్‌ ‌శాఖకు, రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌కూడా బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాలసుబ్రహ్మణ్యం మృతి బాధాకరమని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని తెలంగాణ సిఎం రేవంత్‌‌రెడ్డి ట్వీట్‌ ‌చేశారు.

బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐపిఎస్ అధికారిగా సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించిన బాలసుబ్రహ్మణ్యం మరణం విచారకరమని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా, ఎపిఎస్‌ఆర్‌‌టిసి ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకితభావం, వృత్తిపరమైన నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వంతో పోలీస్‌ శాఖలో చెరగని ముద్ర వేశారని డిజిపి పేర్కొన్నారు. ఆర్‌‌టిసి అభివృద్ధికి, సంస్థ పరిపాలనను బలోపేతం చేయడానికి బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలు చిరస్మరణీయమని ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌‌టిసి హౌస్‌లో నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం సంతాప కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఎపిఎస్‌ఆర్‌‌టిసి ఉన్నతాధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఆర్‌‌టిసి వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కోన శశిధర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ మాజీ డిజిపి, రిటైర్డు ఐపిఎస్ అధికారి అంజనీ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్