బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఐఐ సదస్సు ఏర్పాట్ల పరిశీలన..

06 నవంబర్, 2026

సిఐఐ సదస్సు ఏర్పాట్ల పరిశీలన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సిఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి విశాఖ నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. సదస్సు ప్రాంగణం లే అవుట్‌, ప్రధాన ప్రవేశ ద్వారం, రిజిస్ట్రేషన్ బ్లాక్, ల్యాండ్‌ స్కేపింగ్, ఫౌంటెయిన్లు, శిల్పాలు, పార్కింగ్ ప్రాంతాలు, బారికేడింగ్, వాహనాల రాకపోకల మార్గాలు, సూచిక బోర్డులు, హోర్డింగులు, విద్యుత్ దీపాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను కమిషనర్ కేతన్ గార్గ్ వివరించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా రహదారులు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేపట్టాలని రావత్ సూచించారు. ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాలను పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్, పెయింటింగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్ని పనులనూ నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎపిఇడిబి సిఇఒ సాన్మోహన్, ఎపిఐఐసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సిఐఐ ప్రతినిధి మహేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్