బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్స‌వంపై సమీక్ష‌

06 ఆగస్టు, 2026

tulluru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తుళ్లూరు : రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రానికి ముఖ‌ద్వారంగా నిర్మాణం రూపుదిద్దుకుంటున్న ఉండ‌వ‌ల్లి స్టీల్ బ్రిడ్జిని ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు గురువారం క్షేత్ర‌స్థాయి స‌మీక్షా సమావేశాన్ని నిర్వ‌హించారు. అమరావతిలోని రాయ‌పూడిలో అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) కార్యాలయంలో సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ల‌క్ష్మీపార్థసార‌థి, గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్, సి.ఎం.సాయికాంత్‌వ‌ర్మ, సంయుక్త క‌లెక్ట‌ర్ అశుతోష్ శ్రీవాస్తవ,సి ఆర్ డి ఎ అద‌న‌పు క‌మిష‌న‌ర్ కొల్లాబ‌త్తుల కార్తీక్, ఏడీసీ అధికారులు ముఖ్య‌మంత్రి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్స‌వం ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. స్టీల్ బ్రిడ్జికి స‌మీపంలో డ‌బ్ల్యూఆర్‌డీ గోడౌన్ వ‌ద్ద సుమారు 1500 మంది ప్ర‌జ‌ల‌తో స‌భ ఏర్పాటుపై ఇంజినీరింగ్ అధికారుల‌తో చ‌ర్చించారు. స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా బ‌కింగ్‌హాం కెనాల్‌, గుంటూరు ఛానెల్‌, కొండ‌వీటివాగుల‌లో గుర్ర‌పుడెక్క తొల‌గించి వాటి ప‌రీవాహ‌క ప్రాంతాల‌లో 21 ర‌కాల అంద‌మైన మొక్క‌ల‌ను ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించారు. స‌మావేశంలో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు,టి మోజెస్ కుమార్, బి.న‌ర‌సింహ‌మూర్తి, సీహెచ్‌.ధ‌నుంజ‌య‌, జ‌న‌ర‌ల్ మేనేజర్ కె.శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్