బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు : ఐజి రాజకుమారి

33 నిమిషాల క్రితం

IG B. Rajakumari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని ఐజి బి రాజకుమారి తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించేవారిపై పోలీసుశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకుంటోందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తును పటిష్టం చేశామన్నారు. ఇప్పటి వరకు 607 కేసులు నమోదు చేశామని, 213 మందిని అదుపులోకి తీసుకున్నామని, 1,785 మందికి నోటీసులు జారీ చేశామని, 25,207 బైండోవర్‌ ‌కేసులు, 1,41,687 వ్యక్తులను బైండోవర్‌ ‌చేశామని తెలిపారు. 37,942 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, 9,337 డిపాజిట్‌ ‌చేసిన ఆయుధాలు, 3,548.4 లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్