బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదలాల్‌ స్ట్రీట్‌లో పరుగులు..

19 నిమిషాల క్రితం

sensex.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెన్సెక్స్‌ 1,500 పాయింట్ల లాభం

ముంబయి : దలాల్‌ ‌స్ర్టీట్‌‌లో కొనుగోళ్లతో భారీ ర్యాలీ నమోదయ్యింది. బుధవారం ఒక దశలో 2,000 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్‌ చివరకు 1,502.29 పాయింట్ల లాభంతో 83,938కు చేరింది. నిఫ్టీ 469 పాయింట్లు పెరిగి 25,819.25 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసిజి, ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66 పైసలు బలపడి రూ.92.19 వద్ద ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరుకుంది. సెన్సెక్స్‌ ఉదయం 83,437 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 84,498 గరిష్ఠాన్ని తాకింది. టాటా స్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, టైటాన్‌ మినహా సెన్సెక్స్‌-30లోని మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ట్రెంట్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఇండిగో, హెచ్‌డిఎఫ్‌‌సి బ్యాంక్‌ అధికంగా లాభపడిన వాటిలో టాప్‌‌లో ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 91 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 3,534 డాలర్ల వద్ద కొనసాగాయి. అమెరికా మార్కెట్లలో ఎఐ సంబంధిత షేర్ల పతనం, డేటా సెంటర్ల పెట్టుబడులపై రాబడుల ఆందోళనలతో విదేశీ పెట్టుబడులు భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల వైపు మళ్లినట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషించాయి. ఈ నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) భారత్‌లో 13.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్