బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

27న 'భోగి' విడుదల

27 నిమిషాల క్రితం

27న 'భోగి' విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 08:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భోగి'. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం 'గంగ' థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో శర్వానంద్ నర్సన్నతో సరదాగా మాట్లాడారు. 'మీరు చాలా మంది ముఖ్యమంత్రుల కోసం పాటలు పాడారు. ఇప్పుడు నా సినిమాలోనూ పాట పాడారు. నన్ను కూడా ముఖ్యమంత్రిని చేస్తారా? ఏమో.. నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో' అని అన్నారు. ప్రస్తుతం శర్వానంద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్