బాపట్ల మున్సిపల్ చైర్మన్ బిజెపి అభ్యర్థిపై కర్ణాటక వాసి ఆరోపణ
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : కేంద్రంలో, రాష్ట్రంలో పదవులు ఇప్పిస్తానని చెప్పి బాపట్ల మున్సిపల్ చైర్మన్ బిజెపి అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ తన వద్ద రూ.85 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి నియోజకవర్గానికి చెందిన రవీందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బాపట్లలో మీడియాతో బాధితుడు మాట్లాడుతూ...పదవుల ఆశ చూపి తొలుత రూ.47 లక్షలు తన బ్యాంకు ఖాతాకు జమ చేయించుకున్నారని, మిగతా సొమ్మును విడదల వారీగా ఇచ్చానని తెలిపారు. ఇందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. కాలం గడిచినా తనకు ఎటువంటి పదవులూ ఇప్పించలేదని, మోసపోయినని తెలిసి బెంగళూరు జెసి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. బాపట్ల పురపాలక ఎన్నికల్లో చైర్మన్గా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారని సోషల్ మీడియాతో ద్వారా తెలుసుకుని ఇక్కడి వచ్చానని, తనకు న్యాయం చేయాలని నగరంలోని బిజెపి కార్యాలయంలోకి వెళ్తే బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగా మోసపోయిన వారు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సునీల్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని మీడియా వేదికగా కోరారు.








కామెంట్లు (0)