ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూ.120.89 కోట్ల నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి రూ.120.89 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి హెఫ్సిబా రాణి కొర్లపాటి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జిఓ ఆర్‌టి నెంబర్ 191ను విడుదల చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ (ఎపిఎస్‌హెచ్ సిఎల్)కు రుణాల రూపంలో ఈ నిధులను కేటాయించారు. సంస్థ కార్యకలాపాలు, బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం కింద అవసరమైన ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. 2026-27 బడ్జెట్‌లో ఈ పథకానికి మొత్తం రూ.491.22 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.247.30 కోట్లకు పైగా నిధులు వినియోగానికి అనుమతించారు. తాజాగా మరో రూ.120.89 కోట్లకు అనుమతి లభించింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
Print Editionఇళ్ల నిర్మాణానికి రూ.120.89 కోట్లు విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)