బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరూ.15 కోట్ల క్రిప్టో మోసం ఛేదన

58 నిమిషాల క్రితం

CID DGP Ravishankar Ayyanar.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిఐడి డిజిపి రవిశంకర్ అయ్యన్నార్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంతర్జాతీయ స్థాయిలో సాగిన రూ.15 కోట్ల క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసం కేసులో బాధితురాలికి క్రిప్టో ఆస్తులు తిరిగి చెల్లించేందుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని సిఐడి డిజిపి రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. నిందితులకు చెందిన నాలుగు క్రిప్టో ఖాతాలను గుర్తించి, స్తంభింపజేసిన ఆస్తులను బాధితురాలికి బదిలీ చేయాలని గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ సిఐడి ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చినట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2026 అక్టోబరు 30న జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా ఖాతాల్లోని క్రిప్టో కరెన్సీని ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం యుఎస్‌డిటిగా మార్చి బాధితురాలి వాలెట్‌కు బదిలీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తెనాలికి చెందిన ఓ మహిళను అధిక లాభాల ఆశ చూపి సైబర్ నేరగాళ్లు రూ.15 కోట్ల మేర మోసం చేశారన్నారు. బాధితరాలు ఫిర్యాదు మేరకు బ్లాక్‌చైన్ లావాదేవీల విశ్లేషణ, సాంకేతిక ఆధారాలతో 15 బిట్‌కాయిన్ లావాదేవీలను నాలుగు ఖాతాల వరకు గుర్తించి, న్యాయపరమైన ప్రక్రియ ద్వారా ఆస్తులను స్తంభింపజేశామని వెల్లడించారు. ఈ అంతర్జాతీయ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, మలేషియాకు చెందిన ఒకరు, చైనాకు చెందిన ఇద్దరు, పోర్చుగల్‌కు చెందిన మరొకరు ఉన్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు సంబంధిత న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొన్నారు. కేసు ఛేదనలో నిరంతరం కృషి చేసిన సిఐడి సిఐ కాశీ విశ్వనాథం, హెచ్‌సిలు బి వెంకటేశ్వరరావు, టి విజయకృష్ణకు నగదు బహుమతిని ప్రకటించినట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్