శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం : వైఎస్ షర్మిల

1 గంట క్రితం

ys sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్నబ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అందులో 10 లక్షల ఎకరాలు వరి పంటే ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7 లక్షల మంది రైతులు 100 శాతం పంట కోల్పోయారన్నారు. పంటలు, రోడ్లు, మౌలిక వసతులు కలిపి రూ.15 వేల కోట్ల నష్టం జరిగితే, ప్రభుత్వం మాత్రం రూ.4,600 కోట్లుగా చూపుతోందన్నారు. గత మొంథా తుఫాన్ పరిహారమే ఇంకా ఇవ్వలేదని, ఇప్పుడు కూడా హడావిడి తప్ప ఆచరణ లేదని అన్నారు. నీట మునిగిన వరికి ఎకరాకు రూ.30 వేలు, ఉద్యాన, ఆక్వా పంటలకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతు రుణాలు మాఫీ చేసి రబీకి ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు, మత్స్యకారులను కూడా ఆదుకోవాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్