ప్రజాశక్తి- కె.కోటపాడు (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు పారిశుధ్య పనుల నిమిత్తం తరలించిన పాయకరావుపేట పంచాయతీ కార్మికుడు దడాల వీరబాబు (36) మృతి చెందారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పారిశుధ్య పనులు చేపట్టేందుకు 19 మంది కార్మికులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. కె.కోటపాడులో వీరబాబు శనివారం మృతి చెందారు. ఆయన మృతికి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది. వీరబాబు కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, ఆయన భార్యకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వివి.శ్రీనివాసరావు, ఆర్.శంకర్రావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొలకలపల్లి అప్పలరాజు, ఆడారి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
సిఎం సభకు తరలించిన పారిశుధ్య కార్మికుడు మృతి
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)