శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సస్పెన్షన్‌..

2 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కక్షసాధింపునకు పాల్పడ్డ ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ‌గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రజాక్‌‌ను గుంటూరు మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కమిషనర్‌ సస్పెండ్‌ ‌చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను ‌వంటి అత్యవసర పరిస్థితుల్లో సోషల్‌ ‌మీడియాలో చలో విజయవాడ పేరుతో ఉద్యోగుల విధులకు ఆటంకం, ఉద్యోగాలు మధ్య విభేదాలు కల్గిస్తున్నారని, ఈ చర్యలు ఎపి సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌నిబంధనలు-1964లోని రూల్‌ ‌నెంబర్‌ 3కు విరుద్ధమని కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయమైన హక్కుల కోసం చట్టబద్ధంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై ఈ రకమైన కక్ష సాధింపు చర్యలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు ఖండించారు. రజాక్‌‌పై విధించిన సస్పెన్షన్‌‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్