బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతిలో సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటు : మంత్రి లోకేష్

1 గంట క్రితం

Semiconductor park to be set up in Tirupati Minister Lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 05:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : తిరుపతిలో 5 వేల ఎకరాల్లో ప్రత్యేక సెమీ కండక్టర్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. బుధవారం లోకేష్ మాట్లాడుతూ .... సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. చిప్‌ల తయారీ నుంచి ప్యాకేజింగ్ వరకు ఎపి ని గ్లోబల్ హబ్‌గా మారుస్తామని తెలిపారు. సిలికాన్ ఫ్యాబ్‌లకు కేంద్రం, రాష్ట్రం కలిపి 80 శాతం పెట్టుబడి రాయితీ కల్పిస్తాయన్నారు. డిస్‌ప్లే, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లకు 70 శాతం వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. ఇందుకోసం సెమీ కండక్టర్ పాలసీని రెండో దశ ఇండియా సెమీకండక్టర్ మిషన్‌కు అనుగుణంగా సవరించామన్నారు. తిరుపతిలో 5 వేల ఎకరాల్లో ప్రత్యేక సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, సింగిల్ విండో అనుమతులు కల్పిస్తామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణలతో పాటు యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ పొందే ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.10 వేల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. భారత్ తన చిప్‌లను ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేసే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్