బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

23 నిమిషాల క్రితం

నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు

నేల సంరక్షణతోనే సాగులో మెరుగైన ఫలితాలు సాధ్యమని వ్యవసాయ నిపుణులు సూచించారు. ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని కందిపాపులలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నేల సంరక్షణ ఆవశ్యకత, పిఎండిఎస్, హాఫ్‌మూన్ మోడల్ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా భూసారాన్ని పునరుద్ధరించే పద్ధతులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ విధానాలను వివరించారు. నేలలో తేమను కాపాడుకోవడం, భూసారాన్ని పెంపొందించుకోవడం ద్వారా సాగులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మా పీడీ కె.అప్పలస్వామి, దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్ర పరికరాల శిక్షణ, పరీక్షా సంస్థ డైరెక్టర్‌ ‌కమలాబాయి, గార్లదిన్నె సహాయ వ్యవసాయ సంచాలకులు జి.విద్యావతి, డిఆర్‌‌సిలు కె.లక్ష్మీనరసింహులు, కె.రుమానాబేగం, ఎఒలు భాస్కర్, హరినాథ్‌రెడ్డి, ‌తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్