రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు
ప్రజాశక్తి - ఒంగోలు: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతోపాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
2018లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. జానకి రామయ్య మరణానంతరం ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు 'పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్' పేరుతో బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చారు. అయితే, ఆ చెక్ బౌన్స్ కావడంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది.







కామెంట్‌లు (0)