బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బి-ఫారం అందజేసిన ఈదల రాంబాబు

26 నిమిషాల క్రితం

బి-ఫారం అందజేసిన ఈదల రాంబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 06:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు

ఆలమూరు మండల వైస్ ఎంపిపి పదవికి కూటమి అభ్యర్థిగా ఆలమూరు-3 ఎంపిటిసి సభ్యుడు ఈదల రాంబాబు (టిడిపి) ఎంపికయ్యారు. అధిష్టానం అందజేసిన బీ-ఫారాన్ని బుధవారం ఆయన ఎన్నికల అధికారి, ఎంపిడిఒ ఎ.రాజుకు సమర్పించారు. గురువారం జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపిల ఎన్నిక, అనంతరం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి చింతలూరు ఎంపిటిసి సభ్యుడు బొక్క సహదేవుడు 'విప్'గా వ్యవహరిస్తారని ఎంపిడిఒ తెలిపారు. ఈ సందర్భంగా ఈదల రాంబాబు మాట్లాడుతూ మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అధిష్టానం, కూటమి నాయకుల సమన్వయంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంపిడిఒ రాజుకు బి-ఫారం అందజేస్తున్న రాంబాబు, తదితరులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్