బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెడ్‌పి వైస్‌చైర్మన్‌గా కొంక్యానకు అవకాశమివ్వాలి

24 నిమిషాల క్రితం

జెడ్‌పి వైస్‌చైర్మన్‌గా కొంక్యానకు అవకాశమివ్వాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 06:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా గార మండలం నుంచి జెడ్‌పిటిసిగా ఎన్నికైన కొంక్యాన ఆదినారాయణకు అవకాశం కల్పించాలని గార మండల టిడిపి నాయకులు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో కోరారు. రెండుసార్లు శాలిహుండాం, బోరవానిపేట పంచాయతీల నుంచి ఎంపిటిసి సభ్యునిగా, రెండుసార్లు శాలిహుండం సర్పంచ్‌గా, మూడు దశాబ్ధాలుగా టిడిపి క్రియాశీలక రాజకీయాల్లో కొంక్యాన ఆదినారాయణ ఉన్నారని, టిడిపి గార మండల నాయకులు బడగల వెంకటప్పారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీస రమణమూర్తి, గార ఆస్పత్రి కమిటీ పూర్వ చైర్మన్ కొంక్యాన రమణమూర్తి మంత్రికి వివరించారు. జెడ్‌పిటిసి సభ్యునిగా భారీ మెజార్టీతో ఎన్నికైన ఆదినారాయణను మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరులు కింజరాపు హరివరప్రసాద్ సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్