శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమిథున్‌రెడ్డికి ఎదురుదెబ్బ

2 గంటల క్రితం

MP Mithun Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 09:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నిరాకరణ

ప్రజాశక్తి-అమరావతి : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన దాడుల కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసిపి ఎంపి మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన నాలుగు కేసులను కొట్టివేయాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసులకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 28కి వాయిదా వేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్లు వేసేందుకు వెళుతున్న టిడిపి శ్రేణులపై దాడులు చేయడం, కార్యకర్తలపైకి ప్రైవేటు బౌన్సర్‌ కారును నడిపించడం, హత్యాయత్నానికి పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 16న పుంగనూరు పట్టణ పోలీసులు.. ఎంపి మిథున్‌రెడ్డి, ఆయన అనుచరులపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఒకే ఘటనకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేయడం సరికాదని, రాజకీయ ప్రతీకారంతోనే కేసులు పెట్టారని మిథున్‌రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అయితే, నాలుగు వేర్వేరు నేర ఘటనలు జరిగాయని, బాధితులు, ఘటనల సమయాలు వేర్వేరని పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. వాహనాల్లో కర్రలు, రాడ్లు తీసుకొచ్చి దాడులకు పాల్పడటంతో 30 మంది గాయపడ్డారని, ప్రైవేటు బౌన్సర్‌ కారును ప్రజలపైకి ఉద్దేశపూర్వకంగా నడిపి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు.. పిటిషనర్‌కు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్