సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జూనియర్‌ డాక్లర్లకు స్టయిఫండ్‌ పెంపు

51 నిమిషాల క్రితం

juda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం జూనియర్‌ ‌డాక్టర్ల స్టయిఫండ్‌‌ పెంచింది. ఇందుకు సంబంధించిన జివో 141ను వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి జి వీరపాండియన్‌ ‌సోమవారం విడుదల చేశారు. ఎంబిబిఎస్‌, బిడిఎస్ హౌస్‌ ‌సర్జన్లకు 10శాతం, పిజి డిగ్రీ, డిప్లొమో, ఎండిఎస్‌, డిఎన్‌‌బిలకు 5శాతం చొప్పున పెంచింది. సూపర్‌ ‌స్పెషాల్టి పిజిలకు 5శాతం పెంచింది. 2026 జనవరి 1 నుంచి ఈ పెరుగుదల వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2027 జనవరి 1 నుంచి మరలా 3.5శాతం చొప్పున పెరుగుతుందని వెల్లడించింది.

జుడా అసోసియేషన్‌ అసంతృప్తి

స్టయిఫండ్‌ ‌పెంపుపై జూనియర్‌ ‌డాక్టర్ల అసోసియేషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సవరణను అంగీకరించబోమని అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు ఈశ్వర్‌ ‌శంకర్‌, బి బలగం దినకర్‌ ‌సాయి శ్రీనివాస్‌, ఎం రవితేజ నాయక్‌, ఎస్‌‌కెఎల్‌ ఆలీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమతో పరస్పర అంగీకారం లేకుండా తుది శాతాన్ని నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. సీనియర్‌ ‌రెసిడెంట్లు కూడా జూడాలో అంతర్భాగమని , కానీ వారికి మాత్రం పెంచలేదని విమర్శించారు. సానుకూలమైన చర్చలు, ప్రజాస్వామ్య పద్ధతిలో పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పున:పరిశీలించి తమ ప్రతినిధులతో మరోసారి చర్చలు జరపాలని, పరస్పర అంగీకారంతో న్యాయసమ్మతమైన సవరణనను నిర్ణయించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్