అమరావతి : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల చొప్పున స్త్రీ నిధి రుణం వస్తుందని, దానితో ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చునని, డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ .... గ్రామాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకాన్ని స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీ నిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ పథకంలో మహిళలు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను డిస్ట్రిక్ రిసోర్స్ ఆర్గనైజేషన్స్‌గా పరిగణించి వారి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం జరుగుతుందన్నారు. మహిళలకు కేవలం రుణం ఇవ్వడమే కాకుండా.. వారి వ్యాపారం విజయవంతం అయ్యే వరకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందని తెలిపారు.
డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల చొప్పున స్త్రీ నిధి రుణం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)