ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మైసూరు దసరా సందర్భంగా ముగ్గురు దళిత మంత్రులను పోలీసులు అడ్డుకున్న ఘటన, తమిళనాడులో దళిత విద్యార్థి అఖిలన్ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. కోయంబత్తూరులో 16 ఏళ్ల అఖిలన్పై కులవివక్షకు సంబంధించిన వేధింపులు, దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైసూరు దసరా ఉత్సవాల్లో నందిధ్వజ పూజకు వెళ్తున్న కర్ణాటక మంత్రులు శివరాజ్ తంగడగి, పిఎం నరేంద్రస్వామి, కెఎస్ బసవంతప్పను పోలీసులు అడ్డుకున్న ఘటనపైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. భద్రతా ఏర్పాట్లు, ప్రొటోకాల్ కారణాలతోనే ఈ చర్య తీసుకున్నారా, కులవివక్ష ఏమైనా ఉందా అన్నది తేల్చి వాస్తవాలను వెల్లడించాలన్నారు. వివక్ష, అధికార దుర్వినియోగం నిర్ధారణైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో కులవివక్షను అరికట్టి, దళిత విద్యార్థులకు రక్షణ కల్పించడంతోపాటు అఖిలన్ కుటుంబానికి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Print Editionబాధ్యులపై చర్యలు తీసుకోండి : కెవిపిఎస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)