శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలంపల్లి పర్యటనను అడ్డుకున్న టిడిపి కూటమి నేతలు

06 అక్టోబర్, 2026

వెలంపల్లి పర్యటనను అడ్డుకున్న టిడిపి కూటమి నేతలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - విజయవాడ సిటీ : ​విజయవాడ నగరంలోని 45వ డివిజన్‌‌లో మాజీ మంత్రి, వైసిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం చేపట్టిన ‘గడప గడపకు వైసిపి’ పర్యటనను టిడిపి కూటమి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఎసిపి దుర్గారావు ఆధ్వర్యంలో రోప్ పార్టీతో రంగంలోకి దిగి, కూటమి నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వెలంపల్లికి పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోలీసుల భారీ బందోబస్తు నడుమ ప్రత్యామ్నాయ మార్గంలో వెలంపల్లి శ్రీనివాసరావు తన పర్యటనను కొనసాగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్