మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేర నియంత్రణలో టెక్నాలజీ కీలకం

1 గంట క్రితం

నేర నియంత్రణలో టెక్నాలజీ కీలకం
నెల్లూరులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన డిజిపి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 09:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నెల్లూరులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన డిజిపి

ప్రజాశక్తి -నెల్లూరు : నేర నియంత్రణ, నేర పరిశోధన, రోడ్డు భద్రత, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, శాంతిభద్రతల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకమని రాష్ర్ట డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ జిల్లా పోలీస్‌శాఖ మరో కీలక ముందడుగు వేసిందన్నారు. నగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించి, పోలీస్ సిబ్బందికి కల్పించిన మౌలిక సదుపాయాలు, విధుల నిర్వహణకు అనుకూలంగా ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. అనంతరం మీడియాతో డిజిపి మాట్లాడుతూ... ఆధునిక వసతులతో కూడిన నూతన పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం ​మెన్ అండ్‌ ఉమెన్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక బ్యారక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బ్యారక్స్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, సమీక్ష, పరిష్కారానికి కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులు, పరిష్కార నాణ్యతపై ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎస్‌పి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండేలా రూపొందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించి, ట్రాఫిక్ పర్యవేక్షణకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. పోలీస్ గ్రౌండ్‌లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ పైన ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్‌పి అజిత వేజెండ్ల, అడిషనల్ ఎస్‌పి (అడ్మిన్) సిహెచ్‌ . సౌజన్య, టౌన్ ఎఎస్‌‌పి దీక్ష, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్