శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్ధినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 11:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్‌ కన్వీనర్‌ పల్లవి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యార్ధినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ​ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ పల్లవి డిమాండ్‌ ‌చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి బిసి బాలికల హాస్టల్ విద్యార్థినులపై జరిగిన ఘటనను శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన బొడ్డు వెంకట్రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థినులు చదువుకోవాల్సిన హాస్టళ్లలోనే వారికి రక్షణ లేకపోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ​విద్యార్థినిపై లైంగిక ఘటనకు పాల్పడిన నిందితులపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటకు పంపిన సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచినా విద్యార్థినులు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లలో భయంలేకుండా చదువుకోలేని పరిస్థితి కొనసాగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్రంలో అనేక జిల్లాలలో విద్యార్థినిలపై పాఠశాలల్లో,కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ కల్పించే బాధ్యత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌‌పై ఉందని తెలిపారు. విద్యార్థినిలపై ఇటువంటి ఘటనలు పునరావృతమైతే రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్