సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్ఫూర్తిదాయకం తోరాటి జీవితం..

4 గంటల క్రితం

స్ఫూర్తిదాయకం తోరాటి జీవితం
- నేడు శత జయంతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేడు శత జయంతి

ప్రజాశక్తి - విజయవాడ : స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు తోరాటి లక్ష్మణమూర్తి జీవితం స్ఫూర్తిదాయకం. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన తోరాటి వెంకటరెడ్డి, రావమ్మ దంపతులకు ఐదవ సంతానంగా 1926 అక్టోబర్‌ 13న లక్ష్మణమూర్తి జన్మించారు. విద్యార్థి దశనుండే సోషలిస్టు భావాలు అలవర్చుకున్న ఆయన తన 15వ ఏట గ్రామంలోని బాలలందరిని సమీకరించి బాలల సంఘం, యువజన సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టారు.1943లో పెద్ద కరువు వచ్చింది. యువకులలో దేశభక్తి భావాలు కలిగించేందుకు గ్రంథాలయం స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వంచే నిషేధానికి గురైన ప్రముఖ నవల "మాలపల్లి" రచయిత ఉన్నవ లక్ష్మినారాయణ చేత ప్రారంభోత్సవం చేయించారు. నిరక్షరాస్యుల కోసం అంగర, పడమర ఖండ్రిక దేవాలయాల్లో రాత్రి పాఠశాలలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సాహించి వారి చేత భోదన చేయించారు. గ్రామాల్లోని పెద్దలు, ధనికులను కలిసి వారి నుండి బియ్యం, ధనం సేకరించి అంగర మార్కెట్ లో 40 రోజులు అన్న సంతర్పణ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీని నిషేధించడంతో లక్ష్మణమూర్తి రహస్య జీవితంలోకి వెళ్లిపోయారు. 1946 జూలై 4 దొడ్డి కొమరయ్య ఆత్మార్పణతో ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటం తోరాటి లక్ష్మణమూర్తి వీర మరణం పొందిన 1951 అక్టోబర్ 21 న ముగిసింది. సాయుధ పోరాటం ఏ పరిస్థితుల్లో విరమిస్తున్నామో ఒక రహస్య సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా సైన్యం కాల్పులు జరిపింది. నాలుగు వేలమంది ప్రాణత్యాగాన్ని హోం మంత్రి ఘనకార్యంగా చూపే ప్రయత్నం చేయడం చరిత్రను వక్రీకరించడమే. భారత స్వాతంత్య్ర పోరాటంలో గానీ, సంస్థానాల విముక్తి పోరాటంలో గానీ కించమెత్తు పాత్ర లేని మతోన్మాదులు దేశ పాలనను చేజిక్కించుకోవడం దురదృష్టకరం.సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వికారాబాద్ దళ కమెండర్ గా మరణించిన తోరాటి లక్ష్మణమూర్తి... ఉద్యమ శ్రేణులకు, నేటి మతోన్మోద, సామ్రాజ్యవాద, వినాశకర ఆర్థిక విధానాలపై జరుగుతున్న ప్రజా పోరాటాలకు స్ఫూర్తి దాయకం. గ్రామంలో "తోరాటి లక్ష్మణమూర్తి విజ్ఞాన కేంద్రం", లక్ష్మణమూర్తి నిలువెత్తు విగ్రహం, స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. లక్ష్మణమూర్తి కలలుగన్న అందరికీ కడుపునిండా తిండి, వంటినిండా బట్ట, ఆవాసం, ఉపాధి, మెరుగైన విద్యా, వైద్యం అందుబాటులోకి తేవడం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులు ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించడం తదితర లక్ష్యాలు కలిగిన సోషలిస్టు సమాజ సాధన వైపు పయనించడమే ఆయనకు ఇచ్చే నివాళి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్