ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెదిరించి దోపిడీలు చేసేందుకే ఆయుధాల చోరీ

03 అక్టోబర్, 2026

army
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- బొల్లారం సైనిక ఆయుధాగారం కేసును చేధించిన పోలీసులు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌‌లోని బొల్లారం సైనిక ఆయుధాగారంలో జరిగిన చోరీ కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన 12 ఆయుధాలు, 1,912 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ ఉప్పుతొల్ల మల్లేశ్ అలియాస్ రాజుతోపాటు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వెల్లడించారు. మల్కాజిగిరి డిసిపి కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆమె వెల్లడించారు. బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నుల వద్ద సాయుధ దోపిడీలు చేయాలన్న ఉద్దేశంతో మల్లేశ్ ఆయుధాలను సమకూర్చుకునేందుకు పథకం వేసినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను సెప్టెంబర్ 11న జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. మిగిలిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసి అక్టోబర్ మూడున రిమాండ్ కోసం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉప్పుతొల్ల మల్లేశ్ అలియాస్ రాజు, చెమ్మకర్ నిరంజన్, ప్రకాశం జిల్లాకు చెందిన కొండూరి శేషులు, ప్రకాశం జిల్లాకు చెందిన వినోద్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కుచరకంటి ప్రవీణ్, పశ్చిమబెంగాల్ బారక్‌పూర్‌కు చెందిన అవి డే అలియాస్ ఓబి, బీర్బల్ షా, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉప్పుతొల్ల మల్లికార్జున్ ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్