- ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి :
సహేతుకమైన కారణాలు పేర్కొనకుండా, గత కేసుల్లో కోర్టు విధించిన బెయిల్ షరతులను పరిగణనలోకి తీసుకోకుండా జారీ చేసే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) ఉత్తర్వులు చట్టబద్ధం కావని హైకోర్టు స్పష్టం చేసింది. డిటైనింగ్ అథారిటీ పరిధికి వెలుపల నమోదైన కేసులను కూడా పీడీ ఉత్తర్వుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చని, అయితే ఆయా ఘటనలు తన పరిధిలోని శాంతిభద్రతలకు ఏ విధంగా భంగం కలిగిస్తాయో ఉత్తర్వుల్లోనే స్పష్టమైన కారణాలను నమోదు చేయాలని పేర్కొంది. అనంతరం కౌంటర్ అఫిడవిట్లో ఇచ్చే వివరణలు ఆ లోటును భర్తీ చేయలేవని తేల్చిచెప్పింది. అలాగే డిటెన్యూకు ఇప్పటికే బెయిల్ మంజూరై ఉంటే, ఆ బెయిల్ షరతులు నేరాలను అరికట్టేందుకు సరిపోతాయా, పీడీ చట్టం కింద నిర్బంధించాల్సిన అవసరం ఉందా అనే అంశాలను అధికారులు పరిశీలించాలని సూచించింది. ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వేదాయపాళెం త్యాగరాయనగర్కు చెందిన దేవళ్ల జయప్రకాశ్ను గూండాగా పరిగణిస్తూ పీడీ చట్టంలోని సెక్షన్ 3(1), 3(2) కింద జిల్లా కలెక్టర్/జిల్లా మేజిస్ట్రేట్ 2025 డిసెంబరు 2న నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. చిల్లకూరు, గూడూరు రూరల్, వేదాయపాళెం పోలీస్టేషన్లలో నమోదైన కేసులను అందులో ప్రస్తావించారు. అనంతరం ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 2న వాటిని ధ్రువీకరిస్తూ జిఓ జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయప్రకాశ్ భార్య దివ్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తంకుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.








కామెంట్లు (0)