ప్రజాశక్తి - గోకవరం
ఇటీవల నిర్వహించిన వికసిత్ భారత్ డెబిట్ టాలెంట్ టెస్ట్ లో శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఎస్.భూమిజా సింధు ఉత్తమ ప్రతిభను చాటుకుంది. మండల, జిల్లా స్థాయిల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైందని పాఠశాల కరస్పాండెంట్ సారేపల్లి రామ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ది పట్టుదల, ఆత్మవిశ్వాసం, కృషి, విద్యార్థి ప్రతిభకు నిదర్శనం అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచి శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి కీర్తిని తీసుకురావాలన్నారు. భూమిజా సింధుకి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.







కామెంట్‌లు (0)