గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్నారుల ప్రాథమిక విద్యకు పునాది అంగన్వాడి కేంద్రాలు

56 నిమిషాల క్రితం

చిన్నారుల ప్రాథమిక విద్యకు పునాది అంగన్వాడి కేంద్రాలు 
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 06:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్

చిన్నారుల ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధితో పాటు వారి ప్రాథమిక విద్యకు పునాది అంగన్వా‌డీ కేంద్రాలేనని ఎపి సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమతం కాటమయ్య తెలిపారు. పట్టణంలోని ప్రియాంక నగర్‌లో గురువారం నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ అంగన్వా‌డీ ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆ వార్డు టిడిపి ఇన్‌‌ఛార్జి భీమినేని ప్రసాద్‌నాయుడు, భీమనేని గీతావాణి 20 మంది గర్భి‌ణులకు చీరలు పంపిణీ చేశారు.

వారు మాట్లాడుతూ ‘మన అంగన్వాడీ-మన బాధ్యత’, చిన్నారుల ఆరోగ్యం.. అందరి బాధ్యత అంటూ ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సిడిపిఒ లక్ష్మీ, ఐసిడిఎస్ కోఆర్డినేటర్ నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్