ప్రజాశక్తి - ఆలమూరు
సామాజిక సంస్కరణల కోసం జీవితాంతం కృషి చేసిన రఘుపతి వెంకట రత్నం నాయుడు జీవితం నేటి తరానికి ఆదర్శమని బాలమందిరం ప్రధాన కార్యదర్శి కృష్ణశ్రీ, ఆలమూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లమిల్లి సురేష్ రెడ్డి అన్నారు. గురువారం రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి సందర్భంగా ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నల్లమిల్లి సురేష్ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. సభలో ముఖ్య అతిథులుగా బాలమందిరం ప్రధాన కార్యదర్శి కృష్ణశ్రీ, తెలుగు అధ్యాపకులు జి. శ్రీనివాస్ పాల్గొని వెంకటరత్నం నాయుడు జీవితవిశేషాలు విద్యార్థులకు తెలియజేశారు. ప్రిన్సిపల్ నల్లమిల్లి సురేష్ రెడ్డి, కృష్ణ శ్రీ వెంకటరత్నం నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటర్ విద్యార్ధిని భవ్య చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.







కామెంట్‌లు (0)