గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

57 నిమిషాల క్రితం

శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెనుకొండ టౌన్

​పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. వి.ఆదిశేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏవో కేశవయ్య మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉండాలన్నారు. కష్టపడేతత్వంతో ఏదైనా సాధించవచ్చని సూచించారు.

విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు, ఆటలు పాటలు అలరించారు. సీనియర్ విద్యార్థులు కళాశాలలో మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్