సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తిరుపతి

17 గంటల క్రితం

గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తిరుపతి
- పర్యాటకరంగ అభివృద్ధికి కృషి : ఎపిటిడిసి చైర్మన్ బాలాజీ 
- ప్రజాశక్తి పర్యాటక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
- ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పర్యాటకరంగ అభివృద్ధికి కృషి : ఎపిటిడిసి చైర్మన్ బాలాజీ

- ప్రజాశక్తి పర్యాటక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

- ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

ప్రజాశక్తి - తిరుపతి (మంగళం) : తిరుపతి జిల్లాను పర్యాటక రంగంలో మరింతగా అభివృద్ధి చేయనున్నామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తిరుపతిని ప్రకటించిందని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవ‌లప్‌‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుపతి రూరల్ పరిధిలోని శిల్పారామం వేదికగా జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పర్యాటక రంగాన్ని చిన్న విభాగాలుగా విభజించి సగటున 18 గంటలు ఉండే పర్యాటకులు మూడు రోజులు ఉండేలా తిరుపతిలో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌‌గా మార్చడానికి సంకల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ప్రజాశక్తి’ ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. టూరిజానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన కథనాలతో ప్రత్యేక సంచిక తీసుకురావడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. జాయింట్‌ ‌కలెక్టర్‌ రోణంకి గోవిందరావు మాట్లాడుతూ తిరుపతి జిల్లాను ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేయడానికి అవసరమైన భూ కేటాయింపులను చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ తిరుపతికి వచ్చే యాత్రికులకు పరిశుభ్రతను నగరపాలక సంస్థ అందిస్తోందన్నారు. రీజనల్ టూరిజం డైరెక్టర్ రమణ ప్రసాద్ మాట్లాడారు. అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆలయాల విశిష్టతను తెలుపుతూ రెడ్డి ప్రసాద్ చేసిన గానం అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, ఎస్‌‌వియు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ భూపతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎపిటిడిసి బోర్డు సభ్యులు మునిరత్నం, జిల్లా సిపిఓ రాజశేఖర్, జ్యూడిషరీ అధికారి ధనంజయ నాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్