శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం

21 అక్టోబర్, 2026

sklm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సముద్రం, నాగావళి నది కలిసే మొగ వద్ద నలుగురు మృతి

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ: స్నేహితులతో కలిసి బీచ్‌‌లో ఫొటోలు తీసుకుంటూ ముగ్గురు యువతులు సముద్ర అలల ఉధృతికి ప్రమాదవశాత్తు కొట్టుకుపోగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన యువకుడు ఈ క్రమంలో నలుగురు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... శ్రీకాకుళం నగరానికి సమీపంలో ఉన్న కొత్త రోడ్డు వద్ద నెక్స్ట్ ఏరా వరల్డ్ ఒపిసి ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 27 మంది ఉద్యోగులు మంగళవారం శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగళ్లవానిపేట బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన మహి (19), పావని (19), పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంకు చెందిన బిడ్డిక విక్రమ్ (22), విజయనగరం జిల్లా గజపతినగరం మండలానికి చెందిన మాధవి(19)లు ఫొటో తీసుకునేందుకు సముద్రం, నాగావళి నది కలిసే మగ వద్దకు వెళ్లారు. మహి, పావని, మాధవిలను విక్రమ్‌ ‌ఫొటో తీస్తున్నారు. ఫొటోల కోసం వెనక్కి వెళ్తూ మొగలో పడిపోయారు. నీటి ఉధృతికి వారు ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన విక్రమ్‌ ‌కూడా గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో మంగళవారం సాయంత్రానికి మహి, పావని మృతదేహాలను వెలికితీశారు. బుధవారం విక్రమ్‌, మాధవి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్