సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​బుదరాయవలసలో విషాదం

1 రోజు క్రితం

​బుదరాయవలసలో విషాదం 
- చెరువులో స్నానానికి దిగి ముగ్గురు చిన్నారులు మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చెరువులో స్నానానికి దిగి ముగ్గురు చిన్నారులు మృతి

ప్రజాశక్తి- మెరక ముడిదాం : విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామంలో శనివారం విషాదం అలముకుంది. చెరువులో స్నానానికి దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన మండల హేమ చందర్ (10), సరిది చంద్రశేఖర్ (10), శంకరాపు వెంకటేష్ (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. హేమచందర్ , చంద్రశేఖర్ ఐదో తరగతి, వెంకటేష్ నాలుగో తరగతి చదువుతున్నారు. పాఠశాల విడిచిపెట్టిన అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న చిన్నా చెరువులో స్నానానికి దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు అధికంగా ఉండడంతో ముగ్గురు విద్యార్ధులు మునిగిపోయారు. ఒడ్డుకు చేరుకోలేక ముగ్గురూ మరణించారు. చెరువులో తేలిన మృతదేహాలను గ్రామస్తులు గమనించి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి సిహెచ్‌‌సికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్