సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పారదర్శకంగానే ఉపాధ్యాయ నియామకాలు

1 గంట క్రితం

kuppam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వారి కష్టార్జితాన్ని అపహాస్యం చేయొద్దు

- కుప్పం బహిరంగ సభలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి - కుప్పం : డిఎస్‌‌సి నియామకాల్లో అవినీతికి తావు లేదని, ఆధారాలుంటే అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉపాధ్యాయులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరు నుంచి ఆయన కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ... డిఎస్‌‌సి నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామ న్నారు. డిఎస్‌‌సి ఉద్యోగాలు ఉపాధ్యాయుల కష్టార్జితమని, నియామక ప్రక్రియలో అవినీతికి తావులేదని పేర్కొన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియపై అభ్యంతరా లుంటే కోర్టులను ఆశ్రయించవచ్చని, ఉపాధ్యా యులపై విజయవాడలో దాడులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. డిఎస్‌‌సి నోటిఫికేషన్లు జారీ చేసి, నియామకాలు చేపట్టడం తమ ప్రభుత్వ ట్రాక్‌ రికార్డుగా పేర్కొన్నారు. తన హయాంలో ఎప్పుడూ ప్రశ్నపత్రాల లీకేజీ జరగలేదని, నియామకాలు పూర్తయిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డిఎస్‌‌సి వ్యవహారంపై కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం, విశాఖ సముద్ర తీరంలో ఉపాధ్యాయులు తమ వాదనను వినిపించారని తెలిపారు. ఉపాధ్యా యులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. చట్టపరమైన అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీకి వచ్చి ఆధారాలతో చర్చిస్తే సమాధానం ఇస్తామని చెప్పారు. సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం వెతకాల్సిందే తప్ప దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు.

రౌడీయిజానికి తావులేదు _

రాష్ట్రంలో 2019–24 మధ్య విధ్వంసకర పాలన కొనసాగిందని సిఎం విమర్శించారు. అప్పటి పాలనలో పాలకులే రౌడీయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. కుప్పం వచ్చిన సందర్భాల్లో తనను కూడా ఇబ్బందులకు గురిచేసేందుకు దౌర్జన్యాలకు దిగారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కొందరు హింసాత్మక ధోరణులను కొనసాగిస్తున్నారని, రౌడీయిజం, విధ్వంసానికి పాల్పడేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల చిత్తూరు వైసిపి ఎమ్మెల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు పట్ల సిఎం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కుప్పంలో రౌడీయిజం చేస్తే తోక కట్ చేసి శాశ్వతంగా కుప్పం నుంచి వెళ్లగొడతామన్నారు. ఖబర్దార్ జాగ్రత్తగా అంటూ హెచ్చరించారు.

ఏడవ తరగతి నుంచే ఆంత్రప్రెన్యూర్‌షిప్ పాఠ్యాంశం

ఏడవ తరగతి నుంచే విద్యార్థులకు ఆంత్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పాఠ్యాంశంలో భాగంగా పరిచయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సిఎం తెలిపారు. విద్య పూర్తయ్యే సమయానికి ప్రతి విద్యార్థి ఒక స్టార్టప్ ఆలోచనతో బయటకు వచ్చేలా స్టార్టప్ సంస్కృతిని పాఠశాల స్థాయి నుంచే పెంపొందించాలన్నారు. యువతలో సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, నూతన ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెంచేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయమే శ్రీరామ రక్షక భావించి రైతులు పురుగుల మందులులేని వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. 11 ఏళ్లుగా ఎక్కడికి ఎక్కడ వేడి పెరిగిందని, ప్రపంచమంతా పరిస్థితులు మారిపోయాయని, మనదేశంలో 54 శాతం వర్షపాతం తగ్గిందన్నారు. వాతావరణ సముద్రం దెబ్బ తినడం వల్ల వర్షాలు లేక శ్రీశైలంలో నీళ్లు లేవని, ఆల్మట్టి కొద్దిగా నిండిందని, తుంగభద్రలో పూర్తిగా నీళ్లు లేవన్నారు. మళ్లీ పాత రోజుల్లోకి రావాలని, ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి పురుగులు మందులు లేని వ్యవసాయ విధానాన్ని రైతులు అవలంభించాలని సూచించారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో_ వైసిపికి గట్టి సమాధానం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, గురజాల జగన్‌మోహన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్