గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల అరెస్ట్

1 గంట క్రితం

akp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రావికమతం : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముఖ్య నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారి కఠిన ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్తకోట సి.ఐ జి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో, రావికమతం ఎస్.ఐ రఘువర్మ, సిబ్బంది పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. అనకాపల్లి జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు పాల్పడే వారిపై నార్కోటిక్ డ్రగ్స్ చట్టం (NDPS Act) కింద కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.

అరెస్టయిన నిందితులు:

​A-5: మోపర్తి యశ్వంత్ (23 సంవత్సరాలు), తండ్రి: కోటేశ్వరరావు, నివాసం: ఇరుకుపాలెం గ్రామం, పల్నాడు జిల్లా.

​A-6: షేక్ కరీముల్లా (21 సంవత్సరాలు), తండ్రి: దివంగత కరీమ్, నివాసం: సత్తెనపల్లి, పల్నాడు జిల్లా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్