గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్చువల్‌గా ‘మీ భూమి- బ్లాక్‌చెయిన్‌’ ప్రారంభించిన సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 05:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: ‘మీ భూమి- బ్లాక్‌చెయిన్‌’ పైలట్ ప్రాజెక్టును సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ రికార్డులు సరిగా లేకపోవడంతో విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగాయని చెప్పారు. ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్‌’ వ్యవస్థతో భూములకు శాశ్వత భద్రత దక్కుతుందన్నారు. తొలుత కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు అమలుకానుంది. ఈ మండలాల్లో రీసర్వే పూర్తయిన 89 గ్రామాల్లోని 1,37,763 పార్సెల్‌ మ్యాప్‌లు ప్రాజెక్టు పరిధిలోకి రానున్నాయి. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్