ప్రజాశక్తి -రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొంతమూరులో అమలవుతున్న పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (పి.ఎ.ఎల్) ల్యాబ్‌ను ప్రపంచ బ్యాంక్ బృందం పరిశీలించింది. ప్రపంచ బ్యాంక్ టీమ్ లీడర్ క్రిస్టెల్ కువామే విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభ, డిజిటల్ లెర్నింగ్‌పై పాఠశాల చూపుతున్న అంకితభావాన్ని ఆమె ప్రశంసించారు. పీఎం శ్రీ పథకం కింద నడుస్తున్న ఈ పాఠశాలలో మొత్తం 254 మంది విద్యార్థులు పాల్ ప్లాట్‌ఫారమ్‌లో 100 శాతం చురుకుగా పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్థి సగటున 10.79 గంటలు ప్లాట్‌ఫారమ్‌పై అభ్యసించగా, అసెస్‌మెంట్ సగటు స్కోరు 27.28 నుంచి 30.92కు పెరిగి 13.35 శాతం పురోగతి నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 26 జిల్లాల్లోని 1,502 పాఠశాలల్లో 45,060 టాబ్లెట్‌ల ద్వారా 3.8 లక్షల మంది విద్యార్థులకు పాల్ కార్యక్రమం అందుబాటులో ఉంది. స్వతంత్ర పరిశోధనల ప్రకారం, పాల్ ద్వారా నేర్చుకునే విద్యార్థులు సాధారణ తరగతుల విద్యార్థులతో పోలిస్తే 2.25 రెట్లు వేగంగా అభ్యసిస్తున్నట్లు గుర్తించారు. కొంతమూరు పాఠశాల విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, 2026–27 విద్యా సంవత్సరం నుంచి మరో 327 పీఎం శ్రీ పాఠశాలలకు పాల్ కార్యక్రమాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కార్యక్రమంలో SALT ప్రాజెక్ట్ స్టేట్ కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి, రాష్ట్ర పాల్ సమన్వయకర్త బి. కిషోర్ బాబు, జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వై. లక్ష్మణ కుమార్, ఏఎస్‌వో ప్రసాద్, ప్రధానోపాధ్యాయిని రత్నకళ, కన్వీజీనియస్ మేనేజర్ బి. జీన్ పాల్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధి రాజా హర్ష, వై.వి. ప్రసాద్, పాల్ ఫీల్డ్ సిబ్బంది ఆశ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కొంతమూరులో పాల్ ల్యాబ్‌ను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 05:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)